Wednesday, December 5, 2007

అశ్వమేధ యాగం



అశ్వమేధ యాగాన్ని కేలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే 24 నుండీ 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందులనుండి కాపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.

గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తొకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు.


ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక గోమృగాన్ని(అడవి బర్రె)ని అగ్ని గుండానికి దగ్గరగా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతుబవులను గుర్రనికి కడతారు. ఇంకా చాలా పెంపుడు మరియు అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు) వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు


అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు

మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడవడానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తతిమ్మా రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రం శవంతో భోగించినట్లుగా అనుకరణ చేస్తుంది.

మరుసటి రోజు పొద్దున, ఋత్వికులు మహరాణీ ను రాత్రి గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసేదధిక్ర శ్లోకాలతో లేపుకొస్తారు.

ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరం పై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో , యాగం ముగుస్తుంది.



its taken from a history site

1 comment:

Anonymous said...

నేను తాపి ధర్మారావు గారి " దేవాలయం పై బూతు బొమ్మలు " అనిపుస్తకములో మరోలా ఉంది, I need some clarification from a long time, can you give from where this articcle taken.